భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియాలోని సామాన్య ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. రూ. 72 మేర ధరలు తగ్గించాయి ఆయిల్‌ కంపెనీలు.  దీంతో ఈ తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇక ఈరోజు నుండి ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు రూ.1,676గా ఉంది. ఇటు హైదరాబాద్‌ లో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు రూ.1,903గా ఉంది. ప్రతి నెల ప్రారంభంలో, LPG సిలిండర్ ధరలు సర్దుబాటు చేయబడతాయి.అయితే…డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.855 వద్ద ఉంది.

Spread the love