ప్రపంచ టాప్‌ వర్సిటీ ర్యాంకుల్లో హైదరాబాద్‌కు చోటు..

Hyderabad has a place in the world's top university ranks.న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను పలు అంశాల వారీగా అంచనా వేసే ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌’ గురువారం విడుదలయ్యాయి. 2024 ఏడాదికి గాను ఈ ర్యాంకింగ్స్‌లో అమెరికా, యూకేలకు చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు టాప్‌లో నిలిచి సత్తా చాటాయి. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ మొదటి రెండు స్థానాల్లో నిలవగా.. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పదో ర్యాంకులో ఉంది. ఇక భారత్‌ విషయానికి వస్తే.. మన దేశంలో టాప్‌ వర్సిటీగా బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిలిచింది. తెలంగాణ నుంచి ఐఐఐటీ-హెచ్‌కి ఇంజినీరింగ్‌ విభాగంలో 201-600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించింది.

Spread the love