Saturday, June 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా హద్దులు

200 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా హద్దులు

- Advertisement -


రెవిన్యూ, మున్సిపల్ అధికారుల సహకారంతో ఫెన్సింగ్
హైడ్రా ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్, స్థానికుల హర్షం
‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధుల విజ్ఞప్తికి స్పందన


​నవతెలంగాణ – మణికొండ
రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ డివిజన్‌‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహకారంతో ఫెన్సింగ్ పూర్తి చేశారు. ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో చేసిన దరఖాస్తుకు అధికారులు స్పందించారు. శుక్రవారం తమ సిబ్బందితో భూమి సర్వే నంబర్లు, ఎకరాలను గుర్తించారు. అధికా రులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాల‌గూడ‌ – ఖాజాగూడ స‌రిహ‌ద్దుల్లోని స‌ర్వే నంబర్‌ 452/1 లో 174 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి, 454/1 స‌ర్వే నంబ‌‌ర్‌లో 119.05 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి, మొత్తంగా 293.05 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో 263.05 ఎక‌రాల్లో రెండు గ్రామాల మ‌ధ్య ఓవ‌ర్‌ ల్యాప్ ఇష్యూల‌తో 63.05 ఎక‌రాలు ప్రయివేట్ వ్య‌క్తుల‌కు చెందిన‌దిగా రెవెన్యూ అధికారులు గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వం హెచ్ఎండీఏకు 200 ఎక‌రాలు మాత్ర‌మే కేటాయించింది. ప్ర‌కృతిని ప‌రిర‌క్షిస్తూ చారిత్రక రాళ్ల గుట్ట‌ల‌తో పాటు అతిపురాతన రాతి గుహలు, వివిధ దేవాల‌యాల‌కు 5 ఎక‌రాలు కేటాయించ‌గా, ద‌ర్గాకు 5 ఎక‌రాలు అప్ప‌జెప్పిన‌ట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వాటి మ‌ధ్య‌న ఉన్న చెట్టూ చేమ‌ చారిత్ర‌క గుట్ట‌ల‌ను కాపాడాల‌ని కోరుతూ ద‌శాబ్దాలుగా సొసైటీ టూ సేవ్ రాక్స్‌ ప్ర‌తినిధులు పోరాడుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ మేర‌కు రాతి గుట్ట‌ల‌తో పాటు ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని 2019లో మున్సిప‌ల్‌, రెవెన్యూ శాఖ‌ల‌ను హైకోర్టు ఆదేశించింది. హ‌ద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయ‌డం జాప్యం కావ‌డంతో క‌బ్జాల‌కు ఆస్కారం ఇచ్చి న‌ట్ట‌యింది. ఇదే విష‌యాన్ని సొసైటీ టూ సేవ్ రాక్స్‌ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్, హైడ్రా అధికారులు, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారులతో క‌లిసి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్ర‌వారం ఫెన్సింగ్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ భూమి విలువ‌ రెవెన్యూ రికార్డుల మేర‌కు రూ.30వేల కోట్లు వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. సహజ సిద్ధంగా ఉన్న గుట్టలను, పురాతన చరిత్ర గల కొండలను ద‌శాబ్దాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో హైడ్రా చూపిన చొర‌వ‌ను ప్రజలతో పాటు పర్యావరణ ప్రేమికులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -