రాజకీయ లబ్ధి కోసమే ఎంపీ అరవింద్ బంజారులపై కపట ప్రేమ

– బీజేపీ బంజారులకు చేసింది శూన్యం
– కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షులు యాదగిరి ధ్వజం
నవతెలంగాణ – కంటేశ్వర్
రాజకీయ లబ్ధి కోసమే ఎంపీ అరవింద్ బంజారాలపై కపట ప్రేమ చూపిస్తున్నారని బీజేపీ బంజారాలకు చేసింది ఏమీ లేదని మొత్తం శూన్యంగా ఉందని కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం రోజున కాంగ్రెస్ భవన్ నందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ. కాంగ్రెస్ ఎన్నికల డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఆదివాసీ కార్పొరేషన్,గిరిజన కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ తీసుకువస్తుందని,అదేవిధంగా అసైన్డ్ భూములకు, పొడు భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారు.ఆదివాసీ, గిరిజన సోదరులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలుస్తారనే భయంతో ఎంపీ అరవింద్ రామ్ రావు మహారాజ్ విగ్రహాలు పంపిణీ చేశారని,నిజంగా అరవింద్ కు గిరిజనుల పట్ల ప్రేమ వుంటే కేంద్రంతో మాట్లాడి ప్రతి తండాలో రామ్ రావు మహారాజ్ గుడిలు కట్టించాలని డిమాండ్ చేశారు.2019 ఎన్నికల్లో మా బంజారాల గురువైన రామ్ రావు మహారాజ్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఎన్నికల్లో గెలిచిన అరవింద్ గురువు కి మాట ఇచ్చిన విధంగా గిరిజనుల అభివృద్ధికి కానీ,గిరిజనుల పక్షాన గారి ఏనాడూ నిలపడ లేదు, కేవలం బీజేపీ తమ స్వార్ధ రాజకీయల కోసమే రామ్ రావు మహారాజ్ యొక్క విగ్రహాలను వారి ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు యాదగిరి తెలిపారు. రాజకీయాల కోసం రామ్ రావు మహారాజ్ పేరును వడుకోవడాన్ని గిరిజన ఆదివాసీ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నామని యాదగిరి అన్నారు. బీజేపీ పార్టీ ఏనాడు బంజారాల అభివృద్ధి పట్ల గౌరవం చూపలేదని విమర్శించారు. ఎంపీ అరవింద్ ఐదేళ్ల తన అధికార హయాంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తండాలలో ఏమి అభివృద్ధి చేశారని ఆయన అరవిందుకు చిత్తశుద్ధి ఉంటే తండాలలో పూర్తి అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. శనివారం బీజేపీ పార్టీ అరవింద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతు సేవాలాల్ రామ్ రాజ్ మహారాజ్ సమావేశంలో కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారు తప్ప బంజారాల పట్ల ఎంపీకి ఎలాంటి గౌరవం లేదని విమర్శించారు. సంతు రామ్ రావు మహారాజ్ ధర్మం భక్తి పట్ల బంజారాలకు ఆదేశించారు తప్ప ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరు నడవాలని ఈ సందర్భంగా యాదగిరి తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బంజారాలపట్ల నిర్లక్ష్యం వహించారని ఆయనకు పట్టిన గతే బిజెపికి ఎంపీ అరవింద్ కు పడుతుందని అన్నారు. అదేవిధంగా  మా గిరిజనులకు ఆరాధ్య దైవం అయిన రామ్ రావు మహారాజ్ ను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని,రామ్ రావు మహారాజ్ ను రాజకీయ రొంపిలోకి తీసుకరావద్దని విజ్ఞప్తి చేశారు. మా గిరిజనుల పట్ల ప్రేమ,మా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే మా దీర్ఘకాలిక డిమాండ్ అయిన యస్.టీ లకు ఉన్న రిజర్వేషన్స్ 10% నుండి  12% పెంచాలని ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ కు యాదగిరి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న యస్.సి,యస్.టి బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,యన్.ఐ.టి,ఐ.ఐ.టీ లాంటి ప్రతిష్టత్మక విద్య సంస్థలను నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గం లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులను హైకోర్టు,సుప్రీం కోర్టులలో న్యాయమూర్తులుగా నియమించాలని డిమాండ్ చేశారు.కేంద్రం గిరిజనుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం దాని  వైపాల్యలను కప్పిపుచుకోవడానికి, గిరిజనులను ప్రక్కద్రోవ పట్టించడానికి  రామ్ రావు మహారాజ్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారని,గిరిజనుల పట్ల దొంగ ప్రేమను నటిస్తున్న వాటిని గిరిజనులు నమ్మి మోసపోరని హితావు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి,తరచంద్ నాయక్,ప్రకాష్ నాయక్, రవి నాయక్, సుర్యనాయక్, వెంకట్రంనాయక్ ,శ్రీను, నరేందర్, మోతీలాల్  గిరిజన సోదరులు పాల్గొన్నారు.
Spread the love