- Advertisement -
నవతెలంగాణ – బోనకల్ : దొంగతనాల కేసులో తనను అనుమానించి నల్లగొండ జిల్లా పోలీసులు తీసుకెళ్లి విచారణ అనంతరం తనను వదిలేసారని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన పాకాల పాటి మోహన్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాల కేసులో నల్లగొండ పోలీసులు అనుమానితునిగా తనను తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఆ దొంగతనాల కేసులో తనను నల్గొండ జిల్లా పోలీసులు విచారించారని తెలిపారు. విచారణలో తనకు దొంగతనాలు సంఘటనలో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు భావించి తనను విడిచి పెట్టారని తెలిపారు. తనకు ఆ దొంగతనాలు కేసుకు ఎటువంటి సంబంధం లేదని మోహన్ రాయ్ ఆ ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



