- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు చిన రాజయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం మృతుని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బండి స్వామి పరమర్శించి, ఓదార్చారు, అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఇందారపు చెంద్రయ్య పాల్గొన్నారు.
- Advertisement -



