Thursday, June 11, 2026
E-PAPER
Homeజిల్లాలుతాడిచెర్ల పాఠశాలకు అడ్మిషన్ల వెల్లువ

తాడిచెర్ల పాఠశాలకు అడ్మిషన్ల వెల్లువ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులచే బడిబాటలో భాగంగా తుది నమోదు కార్యక్రమ గురువారం జోరుగా సాగింది. ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా తాడిచెర్ల గ్రామంలోని వెలుమల పల్లె , గౌండ్లపల్లె, సమ్మయ్యపల్లె, ఒడ్డెరపల్లె లో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ప్రకటించి, పాఠశాలలో తమ పిల్లలను చేర్పించుటకు ఉత్సాహం కనబరిచారు.

గత కొన్ని సంవత్సరాలుగా తాడిచెర్ల ఉన్నత పాఠశాల సాధిస్తున్న విజయ పరంపరను చూసి వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక తాడిచెర్ల ప్రభుత్వ పాఠశాల అని భావించి వారి పిల్లలను చేర్పించుటకు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య కార్పోరేట్ స్థాయికి ఏమాత్రం తీసుపోకుండా అత్యున్నత ఫలితాలు సాధించడం, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయడమే ఈ అడ్మిషన్ల పరంపరకు నిదర్శనమని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని నాణ్యమైన విద్యతో వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వి.కుమారస్వామి, ఈ.జయ భాస్కర్, సీ హెచ్.పూర్ణచందర్, మహేష్ , శివరాణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -