Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూరిబాగాంధీ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

కస్తూరిబాగాంధీ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

- Advertisement -

పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం దుబ్బపేట గ్రామపరిధిలో ఉన్న కస్తూరిబా గాంధీ ఆశ్రమ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లుగా పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.భవాని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లును వివరించారు. 6వ తరగతిలో–20 సీట్లు, 7వ తరగతిలో–15 సీట్లు, 8వ తరగతిలో–05 సీట్లు, 9వ తరగతిలో–05 సీట్లు ఖాళీగా ఉన్నట్లుగా తెలిపారు. అదే విధంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో సిఈసిలో-25 సీట్లు, ఎంపీహెచ్ డబ్ల్యూలో–15 సీట్లు ఖాళీగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థినులకు మంచి హాస్టల్ సౌకర్యం, అనుభవజ్ఞులైన, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా నాణ్యమైన బోధన అందించబడునన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలను వెంటనే అడ్మిషన్ చేయించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8106613775, 9676845153, 9704810287 ప్రత్యేక అధికారి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -