Thursday, June 11, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ రంగంలో అపార అవకాశాలు

వ్యవసాయ రంగంలో అపార అవకాశాలు

- Advertisement -

– విద్యార్థులు తమతో తాము పోటీ పడాలి
– వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధి 
హరీష్ ఆర్.వి. అతిధి ప్రసంగం 
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ రంగంలో ఉద్యోగ, వ్యాపార, పరిశోధన, అభివృద్ధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి హరీష్ ఆర్.వి. అన్నారు.  1990 బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థిగా ఆయన గురువారం నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొని “బి.ఎస్‌సి. (అగ్రికల్చర్) విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు” అనే అంశంపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ పట్టభద్రులు తమ వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే ప్రవర్తనా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మేనేజీరియల్ సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడుతూ నిరంతర అభ్యాసం ద్వారా లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

“అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శ్రీహరికోట వంటిది. ఇక్కడి నుంచి విద్యార్థులు రాకెట్ల లా ఉన్నత శిఖరాలను అధిరోహించడం వారి సంకల్పం, కృషి పైనే ఆధారపడి ఉంటుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్ కుమార్ అధ్యక్షత వహించగా, డా. కె. శిరీష, డా. టి. శ్రావణ్ కుమార్ సమన్వయం చేశారు.  ఈ సందర్భంగా డా. రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. హరీష్ ఆర్.వి. తన అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం స్ఫూర్తిదాయకమని తెలిపారు.

కార్యక్రమంలో ప్రథమ సంవత్సరం బి.ఎస్‌సి. (అగ్రికల్చర్) విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాలతో సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వ్యవసాయ రంగంలోని అవకాశాలపై అవగాహన పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు. వ్యవసాయ రంగంలో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవాలంటే ప్రవర్తనా, మేనేజీరియల్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం అత్యంత అవసరమని వక్తలు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -