నవతెలంగాణ-నాచారం
ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం సర్కిల్ శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీ అభివృద్ధి కోసం స్థానిక వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసి కాలనీలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, పార్కుల నిర్వహణ, వర్షపు నీటి నిల్వ సమస్య పరిష్కారం, కాలనీ సౌందర్యీకరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాలనీ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని ప్రతినిధులు కోరగా, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రహ్మపురి కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాదా శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుడి నరేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు బొద్దు నాగ మల్లయ్య, షేక్ అన్వర్‌తో పాటు పలువురు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్రహ్మపురి కాలనీ సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



