Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం 

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం 

- Advertisement -

19, 20, 46 డివిజన్లలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నవతెలంగాణ-కంటేశ్వర్ 

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం  అని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి తెలిపారు. సోమవారం నిజామాబాద్ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నగర మేయర్  కూరగాయల ఉమారాణి 19, 20, 46 డివిజన్లలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా వాటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా కాలనీలలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలను ఓపికగా విన్న మేయర్, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

ముఖ్యంగా తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమని, ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా తీసుకుని నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలని మేయర్ గారు అధికారులకు స్పష్టం చేశారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత మరియు ప్రజా సంక్షేమమే నగర పాలక సంస్థ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అవసరాలు, సమస్యలను తెలుసుకోవడం ద్వారా నగరాభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయగలమని మేయర్ తెలిపారు. ప్రజల సహకారంతో నిజామాబాద్ నగరాన్ని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని అన్నారు. ఈ పర్యటనలో సంబంధిత డివిజన్ కార్పొరేటర్లు, ఏఎంసి నజీర్, ఏఈ సల్మాన్, ఇనాయత్ కరీం , శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృష్ణ , సంబంధిత జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -