Monday, June 15, 2026
E-PAPER
Homeక్రైమ్చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి సోమవారం తెలిపారు. ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 3వ తేదీ రాత్రి 00:21 గంటలకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ ఎదురుగా ఉన్న స్వీట్స్ షాప్ సమీపంలో ఒక వ్యక్తి అనారోగ్య స్థితిలో రోడ్డుపై పడివుండగా.. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 13న మృతి చెందాడు. వైద్యుల తెలిపిన ప్రకారం మృతికి కార్డియా పాల్వనరి గురైనా కారణం కాగా, సెప్సిస్ విత్ సెప్టిక్ ఎన్సెఫలోపతి అండ్ ఆస్పిరేషన్ నెమోనిటీస్ అనుబంధ కారణాలుగా పేర్కొన్నారు.

మృతుడు మహారాష్ట్ర పర్బానికి చెందిన  ఆనంద్, వయస్సు సుమారు 50 సంవత్సరాలుగా గుర్తించబడినాడు. మృతదేహాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి టౌన్–I పోలీస్ స్టేషన్, నిజామాబాద్ లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -