ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్ల‌కు జ‌రిమానా విధించిన ఐసీసీ

నవతెలంగాణ – బ‌ర్మింగ్‌హామ్‌: యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. ఆసీస్ కెప్టెన్ క‌మ్మిన్స్ త‌న పోరాట స్పూర్తితో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. రెండు వికెట్ల తేడాతో ఆసీస్ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. అయితే ఆ మ్యాచ్‌లో స్లోగా ఓవ‌ర్లు వేసినందుకు ఇరు జ‌ట్ల‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక నుంచి రెండు జ‌ట్లు రెండేసి పాయింట్లు కోల్పోనున్నాయి. ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో ఇరు జ‌ట్లు నెమ్మ‌దిగా బౌలింగ్ చేసిన‌ట్లు ఐసీసీ తెలిపింది. ఇరు జ‌ట్ల ఆట‌గాళ్ల‌కు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత కూడా విధించారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ ఫైన్ వేశారు. కేటాయించిన స‌మ‌యంలోపు రెండు ఓవ‌ర్లు త‌క్కువ‌గా వేశార‌ని, ఇరు జ‌ట్ల‌కు జ‌రిమానా విధిస్తున్నట్లు పైక్రాఫ్ట్ తెలిపారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఆ జ‌రిమానా అంగీక‌రించారు.

Spread the love