కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారి కుటుంబలే అభివృద్ధి..

నవతెలంగాణ- తిరుమలగిరి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారి వారి కుటుంబాలనే అభివృద్ధి చేసుకుంటారని నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోరని కేంద్ర ఐటి, సాంకేతిక శాఖ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో శుక్రవారం ప్రచార కార్యక్రమ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా, లిక్కర్ మాఫియా, భూ దందాలు, పేపర్ లీకేజీలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. గత పది ఏళ్లలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వము కృషి చేసిందని చెప్పారు.ఈ నియోజకవర్గంలో సుమారు వేయు కిలోమీటర్ల పరిధి వరకు జాతీయ రహదారులు నిర్మించారన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్యను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో శరవేగంగా అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే అవినీతిపరుల భరతం పడతామని అన్నారు. బీజేపీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య మాట్లాడుతూ స్థానికుడైన నేను ఈ ప్రాంతం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని ప్రతి ఏటా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతిపై ఇసుక, ధాన్యం కొనుగోలు, అక్రమాలు, భూ దందాలు పై విచారణ జరిపిస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని స్థానిక మండల కేంద్రాలలో మౌలిక వసతులు కనిపించడంలో ముందు ఉంటానని చెప్పారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో మౌలిక వసతులు కలిపించడంలో ముందు ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ కు ఓట్లు వేస్తే ఇద్దరు ఒకటే మళ్లీ మన మీద అధికార యంత్రాంగం సవారీ చేస్తుందని వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రజలకు బీజేపీ పార్టీలు గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాపు రవికుమార్, కూరాకుల వెంకన్న, దీన్ దయాల్, మేడ బోయిన యాదగిరి, కొండ సోమయ్య,మూల వెంకటరెడ్డి, హనుమంతు, నవీన్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, కడియం కళ్యాణ్ చందర్, నెమరు గోమ్ముల మహేష్ రావు, సురేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏక స్వామి, గిరి యాదవ్, ఆకుల ఎల్లయ్య, రాఘవరెడ్డి, సోమిరెడ్డి, చిలుక అశోక్, నాగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love