మహరాష్ట్ర విత్తనాలు తెలంగాణలో అమ్మితే కేసులు చేస్తాం: ఏవో నవీన్ కూమార్

నవతెలంగాణ – జుక్కల్

పక్కరాష్ట్రాలైన మహరాష్ట్ర,కర్ణాటక ల నుండి విత్తనాలు, రసాయన ఎరువులు, తీసపకొచ్చి తెలంగాణలో అమ్మకాల చేస్తే చట్టరిత్య కేసులు పెట్టడం జర్గుతుందని జుక్కల్ మండల వ్వవసాయాదికారీ నవీన్ కూమార్ అన్నారు. మంగళ వారం నాడు స్థానిక ఎస్సై సత్యనారాయణతో కలిసి మండలంలోని పలు ఫర్టీలైజర్ దుకాణాలను తనీఖీలు చేపట్టారు. ఈ సంధర్భంగా ఏవో, ఎస్సై మాట్లాడుతు ఎరువుల దుకాణాల యజమానులు రైతులకు తప్పక బిల్లులు ఇవ్వాలని , స్టాక్ రిజిష్టర్,  ధరల పట్టిక, కన్పించే   విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు మేాసం చేస్తే ఉరుకునేది లేదని చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు.
Spread the love