చిన్నారులను ప్రయివేటు పాఠశాలలకు పంపితే పోషక లోపం కలుగుతుంది..

నవతెలంగాణ- రెంజల్

ఐదు సంవత్సరాల లోపు చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లోనే చేర్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. గురువారం రెంజల్ మండలం వీరన్న గుట్ట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసాన్ని పురస్కరించుకొని సర్పంచ్ బైండ్ల రాజు చిన్నారులకు అన్నప్రసన నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని తల్లులకు అవగాహన కల్పించారు. నూతనంగా తమ పేర్ల నమోదు చేసుకున్న బాలింత గర్భిణీ మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వేడి అన్నం తీసుకోవాలని, ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మహిళలను నిర్లక్ష్యం చేయకుండా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. చిన్నారుల ఎత్తు బరువులను తూచి, వారికి తగినంత పోషకారాన్ని అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ప్రతి కుటుంబం తమ పెరట్లో సేంద్రియ ఎరువులతో ఆకుకూరలు పెంచుకోవాలని సూచించారు. నెలలు నిండిన ఇద్దరు చిన్నారులకు సర్పంచ్ రాగి జావా, జొన్న జావాలను అందించారు. గర్భిణీ బాలింత మహిళలకు అందించే ఆహారాన్ని సర్పంచ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, బి. శాంత శాంత కుమారి, ఆశలు కవిత, స్రవంతి, ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సభ్యులు, గర్భిణీ, బాలింత, మహిళలు పాల్గొన్నారు.
Spread the love