పేదలు అభివృద్ధి చెందాలంటే బీఎస్పీ పార్టీతోనే సాధ్యం

– బీఎస్పీ మహబూబాద్ నియోజకవర్గ అభ్యర్థి శేఖర్ నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు : ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేదలు అభివృద్ధి చెందాలంటే అది బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుగులోతు శేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలోని నైనాల, బ్రాహ్మణ కొత్తపల్లి, బొడ్లాడ భూక్యా తండా గ్రామాల్లో పర్యటించారు  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి బి ఆర్ ఎస్   అభ్యర్థులల్లో ఎవరు గెలిచినా కెసిఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి దొరల క్రింద పని చేయాల్సిన దౌర్బాగ్యం ఏర్పడుతుందని అన్నారు  ఇంకా ఎంత కాలం ఇబ్బందులతో పేదల బతుకులు బతుకుదామని అన్నారు  బిఎస్పీ పార్టీ బహుజనుల పార్టీ అని మా నాయకుడు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  బ్యూరోక్రాట్ అని అన్నారు. నోట్ల కట్టలతో ఓట్లు కొని మందు ఇచ్చే పార్టీలకు కాకుండా చదువు, ఉద్యోగం, ఉద్యోగాలు, ఇండ్లు, భూములు  ఇచ్చేబి స్ పి పార్టీ ఏనుగు గుర్తు కు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్, జిల్లా అధ్యక్షులు ఇసంపెల్లి ఉపేందర్, జిల్లా కోశాధికారి జింక లక్ష్మణ్, నాయకులు ఈదునూరి ప్రసాద్, సాగర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love