పనులు కొలతల ప్రకారం చేస్తే పూర్తీ కూలీ చెల్లిస్తాం: చందర్ నాయక్

నవతెలంగాణ  –  జుక్కల్

జుక్కల్ మండలం లోని కేంరాజ్ కల్లాలి మరియు బస్వా పూర్ గ్రామాల్లో ఉపాదీహమీ పనులు శ్రీయ డీఆర్డీఏ సీఈవో  చందర్ నాయక్ మంగళవారం నాడు  ఆకష్మీక తనిఖీ చేయడం జరిగిందని ఎంపిడివో బీ. శ్రీనివాస్ తెలిపారు. ఈ సంధర్భంగా కేమ్రాజ్ కల్లాలీ, బస్వాపూర్ జీపీ సెక్రట్రిలు తమ గ్రామాలలో పల్లే ప్రగతిలో నిర్వహించిన నర్సరీల పెంపకం, శ్మశాన వాటికలు, క్రీడామైదానాలు, వనాలు , కంపోస్ట్ షేడ్, డంపింగ్ యార్డ్, గ్రామ పరిశుభ్రతల పైన దృష్టి సారించాలని జడ్పీ సీఈవో అన్నారు. అనంతరం బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఉపాదీ హమీ పనులు జర్గుతున్న ప్రదేశంలో పనుల పరీశీలన చేసారు. కూలీలలతో మాట్లాడుతు కొలతల ప్రకారం పనులు చేస్తే పూర్తీ కూలీీ చెల్లిస్తామని తెలిపారు. కూలీల సంఖ్య పెంచాలని గ్రామప్రత్యేక  అధికారులకు,  ఉపాదీ హమీ టీఏలను ఆదేశించారు. రికార్డుల నిర్వహణ పకడ్బందిగా  నిర్వహించాలని అన్నారు.  గ్రామ  ప్రజల సమస్యలుఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని,  విధినిర్వహణలో  నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని తెలిపారు. నర్సరీలలో  ముగకాయ, ఉసిరి వంటి మెుక్కలు నర్సరీలలో పెంపకం చేపట్టి రాబోయే హరితహరంలో నాటాలని  ప్రత్యేక  అధికారులకు  సూచించారు. జడ్పీ సీఈవో తో  ఎంపిడివో శ్రీనివాస్, ఎంపివో యాదగిరి,  కేమ్రాజ్ కల్లాలీ జీపీ సెక్రట్రి శ్రీనివాస్, బస్వాపూర్ జీపి సెక్రట్రి నాగయ్య , తదితరులు పాల్గోన్నారు.
Spread the love