కృషి, పట్టుదల ఉంటే పోటీ పరీక్షల్లో రాణించవచ్చు

– సీవిల్స్‌ ర్యాంకర్‌ అడుసుమిల్లి మోనిక
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
భాషపై అవగాహన, పకడ్బందీ ప్రణాళిక, అందుకు తగిన కృషి, పట్టుదల, వ్యక్తిగతంగా నోట్స్‌ తయారు చేసుకునే విధానం ఉంటే ఎవరైనా పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చునని సివిల్స్‌ ర్యాంకర్‌(487) అడుసుమిల్లి మోనిక పేర్కొన్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య విజేత అయినటువంటి అడుసుమిల్లి మోనికను అకాడమీ అడ్వైజర్‌, చీఫ్‌ గార్డెనర్‌, ఎక్స్‌ ఐఓఎఫ్‌ఎస్‌ అడిషనల్‌ కమిషనర్‌ (రిటైర్డ్‌), సాహిత్యం ఫ్యాకల్టీ వై.సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ సురేందర్‌రెడ్డి, కోర్సు కోఆర్డినేటర్‌ దండు జనార్దన్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కె. సతీష్‌కుమార్‌ శాలువాతో సత్కరించి, జ్ఞాపిక, ప్రసంశపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వై.సత్యనారాయణ మాట్లాడుతూ మోనికకు అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని భవిష్య త్తులో వాటిని సాధించేందుకు మరింత పట్టుదలతో ప్రయత్నించాలని సూచి ంచారు. అనంతరం అకాడమీలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోనిక సమా ధానాలు చెప్పి వారిలో ఉన్న అపోహాలను తొలగించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు మెళుకువలు చెప్పారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది అల్లు వెంకటేష్‌, బి. రాజేందర్‌, బి.రంజిత్‌ కుమార్‌, బి.సంధ్యారాణి సోషల్‌ మీడియా ఇన్‌చార్జి కోట మురళీకృష్ణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love