గద్దర్‌ కూతుర్ని విస్మరించడం దుర్మార్గం

– అధికారం రాగానే వేరే అభ్యర్థికి సీటివ్వడం పచ్చిమోసం : దాసోజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ పార్టీ గద్దర్‌ కూతుర్ని విస్మరించడం దుర్మార్గమనీ, గత ఎన్నికల్లో ఆమెకు సీటిచ్చి ఇప్పుడు వేరే అభ్యర్థిని ప్రకటించడం పచ్చిమోసం అని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వయోభారంతో అలసిపోయినప్పటికీ పట్టుదలతో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం కష్టకాలంలో పాదయాత్రలు చేసి, ఆడి, పాడి అసువులు బాసిన గద్దరన్నను, వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విస్మరించి, అవమానించడం నేరమని విమర్శించారు. సినిమా అవార్డులతో సంతోషపెట్టి, అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచన చేయడం న్యాయమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

Spread the love