అర్ధరాత్రి అక్రమ మొరం దందా..

 

– మొరం దందాకు అడ్డాగా నవీపేట్

– గల్లీలలో ప్రమాద గంటికలు..
– ఖాళీ అవుతున్న గుట్టలు..
– చోద్యం చూస్తున్న యంత్రాంగం..
– ప్రభుత్వం మారిన అక్రమార్కుల తీరు మారలే…
నవతెలంగాణ- నవీపేట్: మండలంలో అర్ధరాత్రి అక్రమమురంధంగా జోరుగా సాగుతోంది. ప్రధానంగా మండల కేంద్రంలో అక్రమ మొరం వ్యాపారులు చీకటి వ్యాపారంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గృహ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా రాత్రిళ్ళు మొరం దందా చేసుకుంటున్నారు. ట్రాక్టర్కు 1000 నుండి 1500 రూపాయలు టిప్పర్ కు 2000 నుండి 3000 రూపాయలు తీసుకుంటున్నడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఇంటి జాగా కొనుక్కునే వారిపై గృహ నిర్మాణాలు చేసుకునే సామాన్యులపై మోయలేని భారంగా మారింది.
గల్లీలలో ప్రమాద గంటికలు..
మండల కేంద్రంలో గృహ నిర్మాణాల బేస్మిట్ లో వేసేందుకు రాత్రిపూట అక్రమంగా చిన్నచిన్న గల్లీలలో ఫిట్నెస్ లేని ట్రాక్టర్లు, లైసెన్సు లేని డ్రైవర్లతో దర్జాగా నడిపిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గల్లీలలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోనీ కాలనీలలో ఎక్కువ సంఖ్యలో మూలమలుపులు ఉండడంతో  ప్రమాద గంటీకలు మోగుతున్నాయి.
ప్రభుత్వం మారిన అక్రమార్కుల తీరు మారలే..
గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పేరు చెప్పుకొని అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా మొరం దందాకు అలవాటుపడ్డ మొరం మాఫియా తీరు ప్రభుత్వం మారిన అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నచందంగా కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ మోరం దందాను నిలువరించాలని అధికారులను ఆదేశించిన అధికారులు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారని అధికారులపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని మోరం దందాపై ఉక్కు పాదం మోపి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కోరుతున్నారు.
Spread the love