అక్రమ ఇసుక డంపు పట్టివేత..

– అనుమతులు లేకుండా తరలిస్తే చర్యలు:ఎస్సై మనోజ్ కుమార్
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని కొత్త కోరుట్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమంగా నిలువ చేసి ఉంచిన ఇసుక డంపును పట్టుకుని సీజ్ చేసి రెవెన్యూ అధికారులు అప్పగించినట్లు ఎస్సై బి మనోజ్ కుమార్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం కొత్త కోరుట్ల తండా సమీపంలోని ఓక చోట లింగపుర్ వాగు నుండి కొందరు అక్రమార్కులు ఇసుక డంపును పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి డంపును పెట్టుకున్నట్లు వివరించారు. దీని విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందనే అంచన ఉందన్నారు.రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమంగా ఇసుక తరలిస్తు 4000 వేల నుంచి 5000 వేల వరకు విక్రయించుకుంటున్నారని  ఎస్సై తెలిపారు. పట్టుకున్న డంపును తదుపరి చర్యల నిమిత్తం ఇందల్ వాయి రెవెన్యూ అధికారి మోహన్ కు అప్పగించినట్లు వివరించారు.
ఎవరైన అక్రమంగా తరలిస్తె చర్యలు తప్పవు.. ఎస్సై మనోజ్ కుమార్: ఎవరైనా ఆక్రమంగా ఇసుక తరలించిన అలాంటి వారిపై పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు ఇప్పటికైనా ఇసుక వ్యాపారం చేసేవారు మానుకోవాలని వారికి సలహా ఇచ్చారు.ఎవరైన తరలించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో కానిస్టేబుల్ కిషోర్ కానిస్టేబుల్ నవీన్ హోంగార్డ్ రమేష్, అసిస్టెంట్ సర్వేయర్, విఆర్ఎ లు పాల్గొన్నారు.
Spread the love