Saturday, June 13, 2026
E-PAPER
Homeవరంగల్ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీగా ఇమ్మడి సుజాత ప్రమాణ స్వీకారం

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీగా ఇమ్మడి సుజాత ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – గీసుగొండ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీగా గీసుగొండ మండలానికి  చెందిన ఇమ్మడి సుజాత శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఇమ్మడి శ్యాంబాబు తెలిపారు. 16వ డివిజన్ కీర్తినగర్‌కు చెందిన ఇమ్మడి సుజాత ప్రస్తుతం ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా మహిళా విభాగం నాయకురాలిగా సేవలందిస్తూ, చురుకైన నాయకురాలిగా గుర్తింపు పొందారని ఆయన పేర్కొన్నారు. ఆమె సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీగా నియమించినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు రాయపూడి భవాని ఇమ్మడి సుజాతతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇమ్మడి సుజాత మాట్లాడుతూ, ఆర్యవైశ్య సంఘ అభివృద్ధి, మహిళల సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇమ్మడి సుజాత నియామకంపై పలువురు ఆర్యవైశ్య నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్, గార్లపాటి నాగేంద్రబాబు, గందె శ్రీనివాస్, కళావతి, గార్లపాటి శ్రీలత, రాజమణి తదితరులు ఆమెను అభినందించి, రాష్ట్ర స్థాయిలో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -