సామ్రాజ్యవాదం – లెనినిజం ప్రాధాన్యత

లెనిన్‌ సామ్రాజ్యవాదంపై రూపొందించిన సిద్ధాం త ప్రాధాన్యత ఏమిటి? అది విప్లవం గురించిన భావ ననే విప్లవీకరించింది. అదే దాని ప్రాధాన్యత. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవాలు సంభవించే మునుపే వలస పాలనలో మగ్గిన దేశాలలో విప్లవాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని అప్పటికే మార్క్స్‌, ఎంగెల్స్‌ గుర్తించారు. ఐతే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో విప్లవాలు, వలస దేశాలలో విప్లవాలు వేటికవే సంభవిస్తాయని అప్పటివరకూ భావించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో సోషలిస్టు విప్లవాలు సంభవించే క్రమానికి, ఇంకా అభివృద్ధి చెంద కుండా వెనకబడివున్న దేశాలలో విప్లవాలకు మధ్యగల సంబంధం విషయంలో ఇంకా స్పష్టత లేదు. సామ్రాజ్యవాదం గురించి రూపొం దించిన సిద్ధాంతం ఆ రెండు తరగతుల విప్లవాలను జత పరిచింది. అంతేకాదు, మానవాళి సోషలిజం వైపు సాగించే ప్రస్థాన క్రమంలో వెనుకబడిన దేశాలలోని విప్లవాలను అంతర్భాగంగా చేసింది.
అంటే లెనినిజం విప్లవ క్రమాన్ని ఒకే ఒక సమగ్ర మైన సంపూర్ణ క్రమంగా పరిగణించింది. ప్రపంచం మొత్తం మీద జరిగే ఒక విప్లవ క్రమంగా దానిని చూ సింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచం మొత్తాన్ని తన పెత్తనంలో ఉంచుకున్న ఒక ఇనుప గొలుసుగా చూసి, ఆ గొలుసులో లింకు ఎక్కడ అత్యంత బలహీనంగా ఉంటుందో అక్కడ విప్లవ క్రమం మొదలౌ తుందని, ఆ తర్వాత యావత్తు పెట్టుబడిదారీ వ్యవస్థనూ విప్లవం కూల్చివేస్తుందని భావించింది. అప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక దశకు చేరుకుందని, ఇక అక్కడి నుంచి అది కొనసాగాలంటే మానవాళిని మొత్తంగా వినాశకరమైన యుద్ధాల్లో ముంచెత్తు తుందని చెప్పింది. పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం ప్రపంచాన్ని అంతటినీ తన ప్రభా వంలోకి తెచ్చుకున్నదని, మరింత విస్తరించ డానికి ఎక్క డా ఖాళీ ప్రదేశాన్ని మిగల్చలేదని, ఆయా సంపన్న పెట్టు బడిదారీ దేశాలు మొత్తం ప్రపంచాన్ని తమ తమ ఆధి పత్య ప్రాంతాలుగా పంచుకున్నాయని చెప్పింది. అందు చేత మళ్లీ ప్రపంచాన్ని పునర్విభజించాలంటే ఆయా సామ్రాజ్యవాద దేశాలు తమలో తాము కలహించుకుని యుద్ధాలకు దిగినప్పుడే ఆ పునర్విభజన సాధ్యపడుతుం దని చెప్పింది. లెనిన్‌ చెప్పినట్టుగానే మొదటి ప్రపంచ యుద్ధం ఆ విధంగానే జరిగింది.
సామ్రాజ్యవాదం గురించి లెనిన్‌ చేసిన సిద్ధాంత సూత్రీకరణలు మార్క్సిజాన్ని ఐదు విధాలుగా ప్రధానం గా విస్తరించాయి. మొదటిది : పెట్టుబడిదారీ వ్యవస్థకు ఆవలగా వెనుకబడివున్న దేశాలను (వాటికి అసలు చరిత్ర అంటూ ఏదీ లేనే లేదని హెగెల్‌ వాటిని పక్కన పెట్టేశాడు) ప్రపంచ విప్లవ పరిధిలోకి తీసుకువచ్చాయి. నిజానికి రష్యాలో బోల్షివిక్‌ విప్లవం జరిగిన అనంతరం తక్కిన యూరప్‌ ఖండంలో విప్లవాలు సంభవించే ఆశ లు సన్నగిల్లిపోయి, వెనుకబడిన దేశాలు ప్రపంచ విప్ల వ పరిణామ క్రమంలో కేంద్ర స్థానానికి వచ్చాయి. తన చివరి రచనలలో లెనిన్‌ రష్యా విప్లవం తర్వాత మళ్ళీ చైనాలో, ఇండియాలో విప్లవాలు వచ్చే అవకాశాలు కని పిస్తున్నాయని రాశాడు. అంతేకాదు, రష్యా, ఇండియా, చైనా కలిపితే ప్రపంచంలోని మానవాళిలో సగం మంది ఆ మూడింట్లోనే ఉన్నారని, ఈ మూడు దేశాల్లో విప్లవాలు గనుక జయప్రదం అయితే ప్రపంచం మొత్తం మీద బలాబలాలు సోషలిజానికి అనుకూలంగా మారి పోతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. లెనిన్‌ కమ్యూ నిస్టు ఇంటర్నేషనల్‌ సంస్థ ఏర్పడడానికి తోడ్పడ్డాడు. ఆ సంస్థ సమావేశాల్లో అంతకు మునుపు ప్రపంచం ఎన్న డూ చూడని రీతిలో ఇండియా, చైనా, మెక్సికో, ఇండో- చైనా దేశాల ప్రతినిధులు అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా వంటి దేశాల ప్రతినిధులతో చేయి చేయి కలిపి వ్యవహరించారు.
రెండవది : అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికవర్గ విప్ల వం సాధించేందుకు తోడ్పడే సిద్ధాం తంగా ఉన్న మార్క్సిజాన్ని ప్రపంచ విప్ల వ సిద్ధాంతంగా పెంపొందించాడు. ఐతే, మార్క్సిజానికి ఉన్న విస్తృత పరి ధిని పూర్తిగా గ్రహించగలగాలంటే, సామ్రాజ్యవాదం ప్రపంచం మొత్తం మీద పెట్టుబడి ద్వారా తన ఆధిపత్యాన్ని సాగిస్తున్న తీరును ఆకళింపు చేసుకోవాలి. అందుకు యూరప్‌ ఖండం మినహా తక్కిన ప్రపంచంలోని సమాజాల చరిత్రను మార్క్సిస్టు సిద్ధాంత ప్రాతిపదికన విశ్లేషించవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే వుంది. మూడవ ప్రపంచ దేశాల్లోకి మార్క్సిజం విస్తరిం చి పెంపొందుతున్న క్రమం అటువంటి విశ్లేషణలకు ప్రాతిపదికగా ఉంటుంది. కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, కొమింటర్న్‌ ఈ ప్రక్రియకు ఇచ్చిన ప్రేరణ ముఖ్యమైనది. లెనిన్‌ సిద్ధాంతం మార్క్సిజానికి ఆ విధంగా అంతకు ముందు లేని చేతనత్వాన్ని కల్పించింది.
నిజానికి లెనిన్‌ కన్నా ముందే రోజా లక్సెంబర్గ్‌ ఒక ప్రశంసనీయమైన రీతిలో సామ్రాజ్యవాదం గురించి లో తైన విశ్లేషణ చేసింది. వెనుకబడిన దేశాల మార్కెట్‌ లోకి పెట్టుబడిదారీ విధానం చొరబడడం ఎందుకు అనివా ర్యంగా జరుగుతుందో ఆ విశ్లేషణలో ఆమె వివరించా రు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వెలుపల ఉన్న సమాజం కుప్పకూలిన వ్యవస్థగా మిగిలిపోలేదు. అది పెట్టుబడిదారీ సమాజంలో అంతర్భాగం అయింది. రోజా లక్సెం బర్గ్‌ చేసిన ఈ విశ్లేషణ ప్రధానంగా యూరోపియన్‌ శ్రామిక విప్లవానికి పరిమితమైంది. సంపన్న పెట్టుబడి దారీ దే శాలు యావత్తు ప్రపంచాన్నీ శాశ్వతంగా రెండు భాగా లుగా (వెనుకబడిన, అభివృద్ధి చెందిన) విభజిస్తా యన్న విశ్లేషణ అందులో లేదు. లెనిన్‌ సామ్రాజ్యవాదం సిద్ధాం తం మాత్రం ప్రపంచం ఆ విధంగా శాశ్వతంగా విభజించబడుతుందని చెప్పగలిగింది. అదే లెనినిజం గొప్పదనం.
మూడవది : ”చారిత్రకంగా పెట్టుబడిదారీ విధానా నికి కాలం చెల్లింది” అన్న భావనకు ఒక పూర్తి కొత్త వ్యాఖ్యానాన్ని లెనిన్‌ సిద్ధాంతం అందించింది. అంత వరకూ ఉండిన భావన మార్క్స్‌ తన ”అర్థశాస్త్ర విమర్శ కు చేర్పు” అన్న గ్రంథానికి రాసిన ముందుమాటలో ప్రస్తావించిన వ్యాఖ్యానం మీద ఆధారపడి ఏర్పరచు కున్నది. దాని ప్రకారం, ఒకానొక వ్యవస్థలోని ఉత్పత్తి సంబంధాలు చారిత్రికంగా కాలం చెల్లిపోయి, వాటి పరిధికి లోబడి ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఇంకెంత మాత్రమూ ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. అట్టి పరిస్థితి సమాజంలో సంక్షోభం రూపంలో వ్యక్తమౌ తుంది. అటువంటి సంక్షోభం (యూరప్‌లో) కనిపించక పోవడంతో బెర్న్‌స్టీన్‌ మార్క్సిజాన్నే సవరించాలని డిమాండ్‌ చేశాడు. పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసే లక్ష్యం బదులు ఆ విధానాన్ని సంస్కరించాలని, అందు కోసం కార్మికవర్గం ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అతను ప్రతిపాదించాడు. బెర్న్‌స్టీన్‌ను వ్యతిరేకిస్తూ విప్లవ సాంప్రదాయానికి కట్టుబడిన వారు మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థను ముంచెత్తే సంక్షోభం అప్పటికి ఇంకా రాకపోయినా, అటువంటిది రావడం అనివార్యం అని రుజువు చేయడానికి పూనుకున్నారు.
లెనిన్‌ సిద్ధాంతం ఇక్కడే కొత్త పుంతలు తొక్కింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు చారిత్రకంగా కాలం చెల్లడం, దానిని కూలదోయడానికి పరిస్థితి పరిపక్వం కావడం అనేది ఆర్థిక సంక్షోభం రూపంలో మాత్రమే వ్యక్తం అయ్యేది కాదని లెనిన్‌ స్పష్టం చేశాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ మానవాళిని వినాశకరమైన యుద్ధాలలోకి దించే దశకు చేరిందని, ఆ యుద్ధాల్లో ఒక దేశంలోని కార్మిక వర్గం మరో దేశంలోని కార్మికవర్గంతో ముఖాముఖి తల పడే స్థితికి నెట్టబడ్డారని చూపించాడు. అటువంటి పరి స్థితిలో సామ్రాజ్యవాదులు తమ తమ ప్రయోజనాల కోసం సాగిస్తున్న యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలని, మరో దేశపు కార్మికుల మీదకు తమ తుపాకులను ఎక్కు పెట్టే బదులు, అవే తుపాకులను తమ తమ దేశా ల్లోని పెట్టుబడిదారుల పైకి ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చాడు.
నాలుగవది : ఇప్పుడు విప్లవాలు ఎక్కడ సాగినా, సోషలిజమే వాటన్నింటి లక్ష్యం. ఒకప్పుడు పెట్టుబడి దారీ వర్గం చారిత్రకంగా ప్రజాతంత్ర విప్లవాలకు వైతాళి కులుగా పాత్ర పోషించారు. ఆ తర్వాత కాలంలో, పెట్టు బడిదారీ విధానం ఆలస్యంగా ప్రవేశించిన దేశాల్లో మాత్రం పెట్టుబడిదారీ వర్గం ఆ విధమైన పాత్రను పోషించడం లేదు. ఈ విషయాన్ని లెనిన్‌ ”సోషల్‌ డెమో క్రసీలో రెండు ఎత్తుగడలు” అన్న గ్రంథంలో చర్చిం చాడు. ఇటువంటి సమాజాల్లో ప్రజాతంత్ర విప్లవాన్ని పూర్తి చేసే కర్తవ్యం కార్మికవర్గం మీదే ఉంది. అందు కోసం కార్మికవర్గం రైతాంగంతో కూటమి కట్టాలి. ప్రజా తంత్ర విప్లవ కర్తవ్యాలను పూర్తి చేయాలి. అంతటితో ఆగిపోకుండా సోషలిజాన్ని నిర్మించే వైపుగా ముందుకు సాగిపోవాలి. ఒక వెనుకబడిన సమాజంలో తొలుత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన విప్లవం, కార్మిక-కర్షక విశాల ఐక్యత ప్రాతిపదికన ఏర్పడిన సంఘటన నాయకత్వంలో, అక్కడితో ఆగిపోకుండా సోషలిజాన్ని సాధించే దిశగా ముందుకు సాగిపోవడం అనేది ఇప్పుడు సాధారణ సూత్రం అయిపోయింది. సోష లిజాన్ని నిర్మించడం అనేది కేవలం అభివృద్ధి చెంది న దేశాలలోని కార్మిక వర్గానికి మాత్రమే సంబంధించిన కర్తవ్యం కాదు. మొత్తం అన్ని సమాజాల్లోనూ దశలవారీ గా సాధించవలసిన ఎజెండాగా అది ఇప్పుడు ఉంది.
ఆఖరిది : ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న తలెత్తింది. యూరోపియన్‌ కార్మికవర్గ ఉద్యమంలో సంస్కరణ వాదం ఎందుకు తలెత్తింది? రెండవ ఇంటర్నేషనల్‌లోని అనేకమంది నాయకులు అవకాశవాద వైఖరిని గాని, ‘సంకుచిత దేశభక్తి’ వైఖరిని గాని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎందుకు అనుసరించారు? ఈ ప్రశ్నకు లెనిన్‌ సమాధానం అందించాడు. ఎంగెల్స్‌ అంతకు ముందే కార్మికోద్యమంలో ఒక ”ఉన్నత తరగతి” తలెత్తుతున్న వైనాన్ని గురించి ప్రస్తావించి వున్నాడు. దానిని ఆధారం చేసుకుని లెనిన్‌ సామ్రాజ్యవాదులు తాము కొల్లగొట్టే సూపర్‌ లాభాలలోంచి ఒక చిన్న భాగాన్ని లంచంగా ఇచ్చి కార్మికోద్యమంలో కొందరిని ఏ విధంగా ప్రభావితం చేస్తారో, ఏ విధంగా కార్మికవర్గంలో ”ఉన్నత తరగతి” ఏర్పడుతుందో వివరించాడు.
సామ్రాజ్యవాదంపై లెనిన్‌ రూపొందించిన సిద్ధాం తం ఒక మహత్తర సైద్ధాంతిక విజయం. ”మార్క్సిజం అజేయం. ఎందుకంటే అది సత్యం” అని లెనిన్‌ ఒకసారి ప్రకటించాడు. లెనినిజాన్ని గురించి కూడా అదే విధంగా మనం చెప్పవచ్చు. నూతన పరిస్థితుల్లో ముందుకొచ్చిన అనేక కొత్త సవాళ్ళకు అది కళ్లు చెదిరే రీతిలో సమా ధానాలు చెప్పగలిగింది. లెనిన్‌ చేసిన వాదనలలోని వివ రాలతో ఎక్కడైనా, ఎవరైనా విభేదించవచ్చు. కాని మొ త్తంగా లెనినిజం చేసిన దిశానిర్దేశం మాత్రం పూర్తిగా సరైనది. 1914-1939 మధ్య కాలంలో ప్రపంచంలో జరిగిన పరిణామాలను ముందుగానే సరిగ్గా అంచనా వేయగలిగిన శక్తిని బట్టి లెనినిజం ఎంత సత్యమో చెప్పవచ్చు.
సామ్రాజ్యవాదం గురించి లెనిన్‌ చెప్పినప్పటి నుం చి ప్రపంచం చాలా ముందుకు పోయింది. చాలా మార్పులు వచ్చాయి. లెనిన్‌ కాలంలో పెట్టుబడి కేంద్రీ కరణ గురించి చెప్పినదాని కన్నా ఇంకా చాలా ముందుకుపో యింది. ఆ యా దేశాల ప్రాతిపదికన పోగుబడిన ద్రవ్య పెట్టుబడిస్థానంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టు బడి వచ్చింది. దాని పర్యవసానంగా సామ్రాజ్యవాద దేశాల న డుమ వైరుధ్యాలు ”మౌనంగా” కొనసాగుతున్నాయి. ప్ర పంచం మీద పెట్టుబడి ఆధిపత్యం ముక్కలు ముక్క లుగా చెదిరిపోవడాన్ని అంతర్జాతీయ ద్రవ్య పెట్టు బడి ఆమోదించదు కనుకనే ఈ విధంగా జరుగుతోంది. తన కదలికలకు ఎటువంటి అవరోధాలూ లేకుండా ఉండా లంటే మొత్తం ప్రపంచం అంతా ఒకే ఒక శక్తి ఆధిపత్యంలో ఉండాలన్నది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఉద్దే శ్యం. అందుచేత ఆయా సామ్రాజ్యవాద దేశాలమధ్య శ తృత్వం పెరిగి అది యుద్ధాలకు దారితీయడం అనేది ఇక జరిగేది కాదు.
ఐతే, దీనిని బట్టి ప్రపంచం అంతటా శాంతి వెల్లి విరుస్తుందని అనుకోరాదు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం, ఆర్థిక స్వయం పోషకత్వం కోసం (ఆహార స్వయం పోష కత్వంతో సహా) మూడవ ప్రపంచ దేశాల్లో సాగే ‘జాతీ య’ ప్రయత్నాలపై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిరం తరాయంగా దాడులు చేస్తూనే వుంది. ఆ క్రమంలో అనే క స్థానిక ఘర్షణలు జరుగుతున్నాయి. సామ్రాజ్య వాదు ల సమైక్యశక్తి ఆయా దేశాలకు వ్యతిరేకంగా మోహరించ బడుతోంది. అదే సమయంలో మూడవ ప్రపంచ దేశా ల్లో శ్రామికవర్గ ప్రజల మీద సాగుతున్న దోపిడీ రాను రాను మరింత తీవ్రమౌతోంది. ఆయా దేశాల్లోని కార్పొ రేట్‌-ఫైనాన్స్‌ పెట్టుబడి కూటమి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో అంతకంతకూ మమేకం అయిపోతోంది. దీని ఫలితంగా మూడవ ప్రపంచ దేశాల్లో అసమానత లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కనీసం పౌష్టికాహా రం కూడా పొందలేని పరిస్థితుల్లోకి అత్యధికశాతం జనా భా నెట్టబడుతున్నారు. మరోపక్క సంపన్న దేశాలలోని పెట్టుబడి చౌకగా శ్రమశక్తి లభించే మూడవ ప్రపంచ దేశాలలోకి తరలిరావడానికి సానుకూలంగా ఉండడంతో ఆయా సంపన్న దేశాలలోని కార్మికోద్యమాలు బలహీ నపడుతున్నాయి. దాంతో ఆ సంపన్న దేశాలలో కూడా అసమానతలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చెలాయిస్తున్న ఆధిపత్యం ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రామికవర్గపు స్థితిగతులను తీవ్రంగా దిగజారుస్తోంది.
ఈ పరిస్థితి అధికోత్పత్తి సంక్షోభానికి దారితీసింది (కొనుగోలు శక్తి తగ్గిపోయినందువలన ఉత్పత్తి అయిన సరుకులు చెల్లుబాటు కాకుండా పోయే పరిస్థితి). ప్రస్తు త నయా ఉదారవాద విధానాల చట్రం లోపలే ఈ సమ స్యను పరిష్కరించడం అసాధ్యం. ఈ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు, నయా ఫాసిస్టు శక్తుల విజృంభణకు అవకాశం ఇచ్చింది. ఆయా దేశాల కార్పొరేట్‌ గుత్త పెట్టు బడిదారులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఫాసిస్టు శక్తులతో జత కడుతున్నాయి. ప్రజాతంత్ర హక్కుల కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, పౌరహక్కుల కోసం జరిగే పోరాటాల ప్రాధాన్యత పెరు గుతోంది. ఈ పోరాటాలు సోషలిజం కోసం జరిగే పోరా టంతో ముడిపడి వున్నాయి. ప్రపంచ విప్లవాన్ని సాధిం చడం కోసం లెనినిజం చూపిన మార్గం నేటికీ వర్తిస్తుం ది. ఐతే కాలంతోబాటు విప్లవం యెక్క ప్రధాన కేంద్రీకరణ మారుతోంది.
( స్వేచ్ఛానుసరణ )

– ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love