ఆకట్టుకున్న గురుకుల విద్యార్థుల నృత్యం

నవతెలంగాణ-కల్లూరు
స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఖమ్మం పెవిలిన్‌ గ్రౌండ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శన పలువురుని ఆకట్టుకుంది. పాఠశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు నయా జమేనా ఆయేగా అనే నృత్య రూపాన్ని ఆ పాఠశాల మ్యూజిక్‌ టీచర్‌ డాక్టర్‌ ప్రసన్న మాతృరత్న స్వయంగా రూపొందించి దర్శకత్వం వహించి ప్రదర్శించారు. విద్యార్థుల నృత్య రూపం జిల్లా కలెక్టర్‌ పివి గౌతమ్‌, ఎస్పీ తదితర ప్రముఖుల సమక్షంలో నిర్వహించడంతో వారు విద్యార్థులని అభినందించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య గీతాన్ని తో ప్రతిభ చాటారు. విద్యార్థుల్ని ఉపాధ్యాయురాలని ఆర్‌ సి ఓ ప్రత్యూష, ప్రిన్సిపాల్‌ శ్రీలత ఉపాధ్యాయులు అభినందించారు.

Spread the love