పోషణ పక్షంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై అవగాహన కల్పించాలి

– జి మల్లీశ్వరి సీడీపీఓ తాడ్వాయి సెక్టార్

నవతెలంగాణ – గోవిందరావుపేట
పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యము సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ తాడ్వాయి సెక్టర్ సీడీపీఓ జి మల్లేశ్వరి అన్నారు. శుక్రవారం మండలంలోని చల్వాయి4, బుస్సాపూర్, దుంపలగూడెం 3 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. చల్వాయి కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీడీపీఓ మల్లేశ్వరి మాట్లాడుతూ  గర్భిణిగా ఉన్న సమయంలో చిరుధాన్యాలు, తమ పరిసరాల్లో లభించే ఆకుకూరలు కూరగాయలు పండ్లు తినడం వల్ల మంచి ఆరోగ్యం సాధించవచ్చు అని అన్నారు. బుస్సాపూర్ అంగన్వాడి సెంటర్లో సెక్టార్ సూపర్వైజర్ టి అనంతలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో మహిళలు గర్భిణీ స్త్రీలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. దుంపల్లిగూడెం 2 అంగన్వాడి సెంటర్లో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ లు ముఖ్యఅతిథిగా హాజరై స్త్రీల ఆరోగ్య ప్రమాణాలను కాపాడుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఎల్ కేసు వర్కర్ నాగమణి, ఉపాధ్యాయులు శోభ, పద్మ, అంగన్వాడీ టీచర్స్ మోక్షారాణి, అరుంధతి, అలివేలు, రుక్మిణి ఆయా కేంద్రాల ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love