రజాకార్ల వ్యతిరేక పోరాటంలో

In the fight against Rajakars– మహిళల పాత్ర మరవలేనిది
– ఐద్వా ఉపాధ్యక్షులు బి హైమావతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో మహిళల పాత్ర మరవలేనిదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఉపాధ్యక్షులు బత్తుల హైమావతి తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మహిళల పాత్ర’ అంశంపై శుక్రవారం మూడ్‌ శోభన్‌ అధ్యక్షతన వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజాకార్లను తరిమి కొట్టటంతోనే ఆగకుండా..ఆ తర్వాత నెహ్రూ సైన్యాలతోనూ తలపడ్డారని తెలిపారు. వారి పోరాట తెగువ నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమన్నారు. రజాకార్ల, నెహ్రూ సైన్యాల అకృత్యాలకు బలైంది కూడా ఎక్కువ మహిళలేనని చెప్పారు. అలాంటి గొప్ప పోరాటానికి మతోన్మాద శక్తులు మత కొట్లాటగా చిత్రించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది హిందూ, ముస్లీం కొట్లాట కాదని చెప్పారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పేదల విముక్తి కోసం సాగిన చారిత్రక పోరాటమని తెలిపారు. ఆ పోరాటంలో కుల, మతాలకు అతీతంగా ఉద్యమించారనీ, తద్వారా ఎందరో పాశవిక నిర్భంధానికి గురయ్యారని తెలిపారు. చరిత్రకు వక్రభాష్యాలు చెప్పి రాజకీయ లబ్ది పొందాలని సంఫ్‌ుపరివార్‌ శక్తులు కలలు కంటున్నాయనీ, వారి ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు.

Spread the love