– తగ్గుముఖం పట్టిన గెలలు ధరలు….
– నష్టాల పాలవుతున్న ఫాం ఆయిల్ రైతులు….
– గతేడాది మే లో రూ.22.765 లు….
– ఈ మే లో రూ.13346 లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలలు ధర ఏటికేడాది పడిపోవడంతో సాగుదారుల నష్టాలు పాలు అవుతున్నారు. గతేడాది మే లో టన్ను గెలలు ధర రూ.22.765 లు కాగా ఈ ఏడాది మే లో అదే టన్ను ధర రూ.13.346 లు గా దిగజారిపోయింది.దీంతో ఇప్పటికే సాగు చేస్తున్న ఆయిల్ ఫాం రైతులు ఆవేదన చెందుతున్నాడు.నూతనంగా ప్రారంభించాలనే రైతులు సాగు చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. ఏటికేడాది ధర పెరుగుతుంటే ఏ పంట పండించే రైతైనా ఉత్సాహంగా ప్రారంభిస్తారు.కానీ ఆయిల్ ఫాం పరిస్థితి మరీ విషమంగా ఉంటుందేమో అనే తర్జన భర్జన పడుతున్నారు.
టన్ను గెలలు ధర లాభం – నష్టం అంచనా…
నెల ధర వ్యత్యాసం
నవంబర్ – 22 13,741
డిసెంబర్ – 22 13,881 +140
జనవరి – 23 13,781 -100
ఫిబ్రవరి – 23 13,961 +180
మార్చి – 23 13,943 -18
ఏప్రియల్ – 23 14,205 +262
మే – 23 13,346 -859
గెలలు ధర పెరిగినప్పుడు రూపాయల్లో ను తగ్గినప్పుడు వందల్లో ఉండటం తో రైతు నెల నెలా నష్టాలు బారిన పడుతున్నాడు.