నవతెలంగాణ -కంటేశ్వర్
త్వరలో రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దులో జిల్లాల సరిహద్దుల లో చెకోపోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్కు సంబంధించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ ఐపీఎస్ తెలియజేశారు.ఈ సందర్భంగా పోలీస్, ఎక్సైజ్, కమర్షలెక్స్, రోడ్డు ట్రాన్స్పోర్టు, ఫారెస్టు, రెవెన్యూ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.శనివారం నాడు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూరా రోడ్డులో గల ఎన్.ఎన్ ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, నాందేడ్ జిల్లా పోలీస్ అధికారులతో రాబోయే ఎన్నికల దృష్ట్యా సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ఇంటర్ స్టేట్ బోర్డర్ పోలీస్ అధికారులతో కో-ఆర్డినే షన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఎలక్షన్ సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెకోపోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణ నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు, ఇరు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, నాందేడ్ జిల్లాలతో సరిహద్దులో ఉన్న సమస్యాత్మ కమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని చెక్పోస్టులు నిరంతరాయంగా కొనసాగిస్తూ పకడ్బ ందీగా తనిఖీలు నిర్వహించాలని, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు చెకోపోస్టులను సంబంధిత అధికా రులు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట ( ఎన్.బి.డబ్ల్యూ ) ల విషయంలో ఇరు జిల్లాలు / రాష్ట్రాల అధికారులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెల్లాలని తెలియజేశారు. అంతర్ రాష్ట్ర చెకోపోస్టులు సాలూరా, కండ్గాన్, కందకుర్తీ, పోతంగల్ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుందని, అంతర్ జిల్లా చెకోపోస్టులు డొడ్గాన్ ( సోన్ ), బ్రహ్మంగారి గుట్ట, సిరికొండ, ఇంద ల్వాయి టోలాజా, మల్లారం గండి, యంచ (బాసర) వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతు ందని తెలియజేశారు.గతంలో మధ్యం అక్రమ రవాణా తరచూ చేస్తూ పట్టుబడిన వారిపై కూడా నిఘా పెట్టి వారిని నియంత్రించే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సరిహద్దుల్లో హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రో లింగ్ పెంచాలని, సరిహద్దులో పోలీస్ అధికారులు వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పు డు సమాచారాన్ని తెలుసుకొని నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో అదిలాబాద్ జిల్లా ఎస్.పి డి. ఉదయయ్ కుమార్, ఐ.పి.యస్., నిర్మల్ జిల్లా ఎస్.పి. సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్., జగిత్యాల జిల్లా ఎస్.పి భాస్కర్, కామారెడ్డి జిల్లా ఎస్.పి. బి. శ్రీనివాస్ రెడ్డి, నాందేడ్ జిల్లా ( బోకర్ ) అదనపు ఎస్.పి డా॥ కె.ఎ. ధరణి, నిజామా బాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. జయామ్, నిజామాబాద్ కమర్షల్ ట్యాక్స్ అధికారి లావణ్య, ఎక్సైజ్ సూపరింటెండెంటు కె. మల్లారెడ్డి, రెవెన్యూ అధికారులు, బోధన్ ఎ.సి.పి. నిజామాబాద్ ఎ.సి.పి, బాన్సువాడ ఎ.సి.పి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, సి.ఐ లు, ఎస్.ఐలుతధితరులు పాల్గొన్నారు.