నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిరిసిల్లలో నాతో పాటుగా ముందు నడిచిన ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థులు అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ సంవత్సరంతో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన శనివారం తెలంగాణ భవన్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థుల కోసం రాజన్న సిరిసిల్లలో జేఎన్టీ యూహెచ్ కళాశాలను తీసుక రావడం జరిగిందని గుర్తు చేశారు. డిఎస్‌ఎఫ్ స్థాపించి నప్పుటి నుంచి ఇప్పటి వరకు పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం డిఎస్‌ఎఫ్ వారు నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్ర మాలను అభినందించారు. పాలి టెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి సమస్యల పరి ష్కరణ కోసం వారి సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేత, డిప్లోమా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎరవెల్లి జగన్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించి, దేశ, రాష్ట్ర అభివద్ధిలో ముందు ఉండాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన వేలాదిమంది విద్యార్థులకు జీవితానిస్తూ డిప్లొమా సర్టిఫికెట్ ఇచ్చేలా అవార్డు ఆఫ్ డిప్లోమాను 2020లో పోరాడి సాధించింద న్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు పోరాటం చేసి స్పాట్ అడ్మిషన్ పెట్టించడం జరిగింద న్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించేందుకు కృషి చేసింది అని తెలిపారు. డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ఇన్‌చార్జి అభిషేక్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌చార్జి టకుమాళ్ళ ప్రదీప్, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌చార్జి మాసం శ్యామ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్‌చార్జి రేణిగుంట్ల సందీప్, అఖిల, సోను పాల్గొన్నారు.