కరిపె రాజ్ కుమార్ ఆజాదీ కవితా సంపుటి ఆవిష్కరణ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆజాదీ అనేది కొరవడిన సమయంలో మనం ఈరోజు ఆజాదీ కవిత్వాన్ని ఆవిష్కరించుకుంటున్నామని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పాలపిట్ట బుక్స్ సంపాదకులు గుడిపాటి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఆనందాచారి ఆజాదీ కవితా సంపుటిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం నాడు ఆజాదీ కవితా సంపుటిని ఆవిష్కరించుకోవడం సమయోచితంగా ఉందని తెలిపారు. కరిపె రాజ్ కుమార్ కవిత్వం మంచి స్పార్క్ ఉన్న కవి అని ప్రశంసించారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన తంగేడు మాస పత్రిక వర్కింగ్ ఎడిటర్ డాక్టర్ కాంచనపల్లి గోవర్ధనరాజు మాట్లాడుతూ కరిపె రాజ్ కుమార్ మంచి చూపు ఉన్న కవి అని అన్నారు. ఈ సభలో ఆజాదీ కవిత్వాన్ని ప్రముఖ విమర్శకులు ఎం. నారాయణ శర్మ, ప్రముఖ కవులు కొమ్మవరపు విల్సన్ రావు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ లోతుగా విశ్లేషించారు. ఈ సభలో ప్రముఖ కవులు తంగిరాల చక్రవర్తి, కొప్పిశెట్టి ఝాన్సీ, దామోదరాచారి , కూర చిదంబరం, అనంతోజు మోహన్ కృష్ణ, దాసరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love