
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని జడ్పీహెచ్ఎస్మేషరాజపల్లి పాఠశాలలో నోడల్ ఆఫీసర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జిన్నారపు మంగతాయి చేతుల మీదుగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం. ఆర్ యు పి పి టి స్ ( RUPP-TS) క్యాలెండర్ ఆవిష్కరణ గురువారం నిర్వహించినట్లు ఆర్ యు పి పి టీఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు మడిపెల్లి రమేష్ తెలిపాడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పండితులు హైస్కూలలో వెట్టి చాకిరి చేస్తున్నారు సర్వీస్ లో ఒక్క ప్రమోషన్ లేకుండా పదవీ విరమణ పొందుతున్నారు గత ప్రభుత్వం ఎన్ని జీవోలు తీసుకొచ్చినా పండితులకు న్యాయం జరగలేదు తమకు న్యాయం జరిగే విధంగా పండిట్ వ్యవస్థను రద్దుచేసి పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరినారు, నోడల్ ఆఫీసర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు జిన్నారపు మంగతాయి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రమోషన్ లేకపోవడం బాధాకరం పండితుల యొక్క పదోన్నతుల కోరిక త్వరగా నెరవేరాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బొబ్బిలి శశికుమార్ ,ఎండి చాంద్ ,చాగంటి స్వామి ,గుర్రాల వెంకటేశ్వర్లు ,పాట్ల కరుణాకర్ ,కంజర్ల సంపత్ ,అజ్మీర హరి సింగ్, గాంధారి సింహాద్రి, గోనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.