
నవతెలంగాణా- ముత్తారం: సిఎం కెసిఆర్ తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి బిఆర్‌ఎస్‌లో అధిక సంఖ్యలో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. ముత్తారం మండలం పారుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోడం వెంకటేష్, మరికొంత మంది పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంథనిలోని రాజగృహ వద్ద వారికి శుక్రవారం పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మూడవ సారి బిఆర్‌ఎస్ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సారి మళ్లీ మంథని బిఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముత్తారం మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి, ఎంపిపి జక్కుల ముత్తయ్య పటేల్, జడ్పిటిసి చెలుకల స్వర్ణలత అవోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇల్లెందుల అశోక్ కుమార్, నరెడ్ల రమేష్, పర్ష శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులున్నారు.