
డబ్ల్యూటీవో నుండి భారత్ బయటకి రావాలి అని నిజాంబాద్ గాంధీ చౌక్ నుండి మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా చేరుకొని అనంతరం ఎస్.కె ఎం నాయకులు తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద వెంకట రాములు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, ఏఐకేఎంఎస్ భాస్కర్ జిల్లా నాయకులు మాట్లాడుతూ..వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్( డబ్ల్యూటీవో ) నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేశారు. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా ( ఎస్ కే యం ) పిలుపులో భాగంగా డబ్ల్యూటీవో నుండి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు అబుదాబిలో డబ్ల్యూటీవో సదస్సు ప్రారంభం కానున నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా డేగా పాటిస్తున్నామని అన్నారు. రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ (ఎం ఎస్ పి) మంజూరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని బలవంతం చేయడంతో పాటు సబ్సిడీల ప్రయోజనాలకు నేరుగా బదిలీ చేయాలని వాదించడం ద్వారా పిడిఎస్ ను ఉపసంహరించుకోవాలని డబ్ల్యూటీవో ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. ఈ రెండు ప్రతిపాదనల వల్ల రైతులు, పేద ప్రజలు, ఆహార భద్రతతో పాటు దేశ సౌరభవముత్వానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దులు ఆందోళన చేస్తున్న రైతుల ట్రాక్టర్లను పోలీసులు దగ్ధం చేసి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిరసనలు మృతి చెందిన వారికి రూ. కోటి నష్టపరిహారం పాటు ధ్వంసమైన 100 డాక్టర్ల మరమ్మత్తుల ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వందిగి రాకుంటే మార్చి 14న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షులు వేషాల గంగాధర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వడ్డెన్న సత్యనారాయణ, ఏఐకేఎంఎస్ నాయకులు సాయి రెడ్డి, మురళి సుధాకర్, నాయకులు ఐఎఫ్టియు నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.