
కేంద్ర ప్రభుత్వం గతంలో రైతులకిచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని రైతాంగసమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 14న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ )పిలుపు నిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఎఐకెఎంఎస్) డివిజన్ కమిటీ సమావేశానికి జిల్లా కార్యదర్శి సాయరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. చారిత్మాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా మోడీ సర్కార్ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని,రెండు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిరంకుశంగా రైతాంగ ఉద్యమాలను అణిచివేయడం కోసం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మోడీ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హర్యానా, పంజాబ్ కు చెందిన లక్షల మంది రైతాంగం తమ వాహనాల్లో శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తున్నటువంటి క్రమంలో హర్యానా, పంజాబ్ బార్డర్లలో రైతాంగం పై కేంద్రం మోడీ ప్రభుత్వం పాషవికంగా దాడులు ధమన కాండను కొనసాగిస్తూ భాష్పా వాయు గోళాలను, టీఆర్ గ్యాస్, వాటర్ కేన్సర్, రబ్బర్ బుల్లెట్ల ద్వారా విచక్షణంగ రైతులపై కాల్పులు జరిపి, రైతు చావుకు కారణమయ్యారని అయన అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సంయుక్త కిషన్ మోర్చా ఆధ్వర్యంలో మార్చి 14న ఢిల్లీ నడిబొడ్డున జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని విజయవంతం కోసం లక్షలాదిమంది గా రైతులు కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు దేవస్వామి, కృష్ణాగౌడ్, బన్సీ, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.