పారిశ్రామిక సమ్మె- గ్రామీణ భారత్ బంద్ విజయవంతం

నవతెలంగాణ- తిరుమలగిరి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మతోన్మాద,కార్పొరేట్ అనుకూల విధానాలకు తిరుమలగిరి మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు.ఈ సందర్బంగ , ‘సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి, పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్ , జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి కడెం లింగయ్య,, ఎం సిపిఐయు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలం పూర్తవుతుందని ఈ పది ఏళ్ల కాలంలో పచ్చి మతోన్మాద,కార్పొరేట్ అనుకూల విధానాలతో పాలిస్తూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మి వేయడం, విచ్చలవిడిగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం తద్వారా అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను విచ్చలవిడిగా ప్రోత్సహించిందని వారు ఆరోపించారు.భారత జాతీయ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీస్తూ దేశ సంపదనంత అంబానీ, ఆదాని,మోడీలకు గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెట్టిందన్నారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలన్నీ దేశంలోని పేద ,బడుగు,బలహీన వర్గాల ప్రజలపై పన్నుల భారాన్ని పెంచేవే. ప్రజల శ్రమను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేవే. విద్య, వైద్యం,ఉపాధి అవకాశాలను కొల్లగొట్టేవే. ప్రజల మధ్య సౌబ్రాతృత్వాన్ని సోదర భావాన్ని దెబ్బ తీసిందనీ వారు అన్నారు,వైశమ్యాలను పెంచేవే. అందులో భాగంగానే రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలు, 44 లేబర్ కోడ్స్ ను నాలుగు కోడ్స్ గా కుదించడం, సిఏఏ,ఎన్.ఆర్.సి తీసుకురావడం, నూతన జాతీయ విద్యా విధానం 2020 బలవంతంగా రుద్దడం తద్వారా వీటి ద్వారా కార్పొరేట్లకు గులాంగిరి చేయడానికి తహతహలాడుతున్నారనీ. వీరి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడకుండా ప్రజల మధ్య మతోన్మాదాన్ని పెంచి,.ప్రధానంగా నేడు దేశ రైతాంగం రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం హామీలు ఇచ్చిన వాటికోసం పోరాడుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్టాన్ని చేయమని అడుగుతున్నారు. లఖింపూర్ కేరి లో రైతులపై పాషవికంగా కార్లు ఎక్కించి చంపిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా పై చట్టరీత్యా చర్యలు తీసుకోమని కోరుతున్నారు. రైతాంగ ఉద్యమంలో అమరులైన 750 రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఇవన్నీ గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి అమలు చేస్తామని మాట ఇచ్చి ఆచరణలో మోసం చేశాడనీ చెప్పారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండలం కార్యదర్శి తీప్పిరాల శ్రీకాంత్, పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల సుధాకర్, అశోక్, బోండ్ల వెంకన్న, ఎక్కుబాలు, జెంపాల మల్లయ్య, మల్లయ్య, ఎల్లంల కొమరయ్య, కోమిరెల్లి,తదితరులు పాల్గొన్నారు.

Spread the love