Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్లు మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు, ఉపాధి

రోడ్లు మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు, ఉపాధి

- Advertisement -


మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తాండూర్‌‌లో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
నవతెలంగాణ-తాండూరు

​ రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వికారాబాద్‌ ‌జిల్లా తాండూర్‌ ‌నియోజకవర్గంలో రూ.2 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జెపీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా రోడ్ల అభివృద్ధికి రూ.900 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. రూ.94 కోట్లతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా రూ.30 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెడుతామన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో 571 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్స్‌ కేటాయించామన్నారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం హ్యాం ద్వారా నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. తాండూరు నియోజకవర్గానికి రూ.260 కోట్లు, పరిగికి రూ.184 కోట్లు, వికారాబాద్ కు రూ.261 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.58 కోట్ల 52 లక్షలు మంజూరు అయ్యాయని వివరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డీఓ అనిత, ఆర్ అండ్ బీ ఎస్ఈ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చై‌ర్‌పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -