Monday, June 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహై స్పీడ్ రైల్వే అలైన్‌మెంట్‌లో అన్యాయం

హై స్పీడ్ రైల్వే అలైన్‌మెంట్‌లో అన్యాయం

- Advertisement -

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు
మంత్రి దామోదర, ఎంపీ రఘునందర్‌రావును కలిసిన
సంగారెడ్డి జిల్లా బుల్లెట్ ట్రైన్ సాధన సమితి సభ్యులు

నవనవతెలంగాణ-జహీరాబాద్
హైదరాబాద్-ముంబై ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ (హైస్పీడ్ రైల్వే) అలైన్‌మెంట్‌కు సంబంధించి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆదివారం రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహను మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్‌రావును ఆయన కార్యాలయంలో కలిశారు. వారికి జహీరాబాద్ నియోజక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని సాధన సమితి వివరించారు. తిరిగి డీపీఆర్‌ను మార్చి జహీరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా చర్యలు చేపట్టాలని చేస్తున్న ఉద్యమానికి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్టు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు తెలిపారు. నాయకులందరూ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించి అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి, సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మెన్ శివకుమార్, గొల్ల భాస్కర్, అడ్వకేట్ పాండు రంగారెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -