ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

– శంకరపల్లి ఎంపీడీవో వెంకయ్య
నవతెలంగాణ-శంకర్పల్లి
ఇండ్లు నిర్మించుకునే వారందరూ ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని శంకరపల్లి ఎంపీడీవో వెంకయ్య తెలిపారు. మండల పరిధిలోని దొంతన్‌ పల్లి గ్రామంలో ఆదివారం నాడు ఇంకుడు గుంతలకు ముగ్గు పోయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో నీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే నీరు స్టోరేజ్‌ గా ఉండడానికి వీలుంటుంది అన్నారు. ఆ నీరే మళ్లీ బోరు ద్వారా మనకు మంచినీరు అందుతాయని తెలిపారు. ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల నీటి సమస్య ఉండదని ఆయన సూచించారు. ఇండ్లు నిర్మించుకునే వారందరూ ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే నీటి సమస్య ఉండదని అన్నారు. కార్యక్రమంలో ఏపీవో నాగభూషణం, గ్రామ కార్యదర్శులు ఎల్లయ్య, ఉమా తదితరులు ఉన్నారు.

Spread the love