అమాయక మహిళలే టార్గెట్‌

Adilabad– జిల్లాలో జోరుగా వ్యభిచార దందా
– లాడ్జీలో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-మంచిర్యాల
జిల్లాలో జోరుగా వ్యభిచార దందా కొనసాగుతుంది. హోటలళ్లు, లాడ్జీ, నివాస గృహాలు అడ్డాగా కొందరు నిర్వాహకులు ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. అమాయక మహిళలను టార్గెట్‌ చేసుకొని వారికి డబ్బు ఎరగా వేసి వారిని ఈ కూపం లోకి లాగుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, షార్ట్‌ ఫిలిమ్స్‌లో అవకాశాలు ఉన్నాయంటూ వారికి మాయ మాటలు చెప్పి వారిని వ్యభిచారంలోకి దించి అందిన కాడికి దండుకుంటున్నారు. నిర్వాహకులు డబ్బులు అవసరం ఉన్న మహిళలను ఇతర ప్రాంతాలకు తరలించి వారితో వ్యభిచారం చేపిస్తున్నారు. ఇష్ట రీతిలో జరుగుతున్న ఈ వ్యభిచార గృహలపై మంచిర్యాల పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల మూడు చోట్ల వ్యభిచార గృహాలపై దాడి చేసి విటులను, నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. 20 రోజుల వ్యవధిలోనే మంచిర్యాల పట్టణంలో వ్యభిచారం నిర్వహించే ముఠాల గుట్టు రట్టు కావడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
మంగళవారం మంచిర్యాల పట్టణం లోని జన్మభూమి నగర్‌లో గల వెంకటేశ్వర లాడ్జ్‌లో తనిఖీలు చేసే క్రమంలో 6 గురు యువతులను, 6 గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. బుధవారం మంచిర్యాల పట్టణ సిఐ వివరాలు వెల్లడించారు. లాడ్జ్‌ వ్యవహారాలు చూసుకుంటున్న నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌కు చెందిన గోదారి దుర్గయ్య అతని భార్య శైలజ అమాయక మహిళలకు డబ్బు ఎరగా చూపి ఈ దందా లోకి లాగుతున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు, షార్ట్‌ ఫిలిమ్స్‌లో అవకాశం ఇపిస్తామంటూ మహిళలకు మాయ మాటలు చెప్పి లాడ్జ్‌కి తీసుకొచ్చి వారితో వ్యబిచారం చేయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు తేలిందన్నారు. తనిఖీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విటులను పట్టుకొని విచారించగా వారు మంతెన శ్రావణ్‌, గాంధీనగర్‌, సీసీసీ నస్ఫూర్‌, బొడ్డుపల్లి శివకుమార్‌, పెద్దపల్లి, కూకట్ల పురుషోత్తం, సంపుటం, వేమనపల్లి, పెరుగు సాయిప్రసాద్‌ కోనంపేట, నెన్నెల్‌ మండలం, బెడ్డల రాహుల్‌, మెట్‌పల్లి, నెన్నెల్‌ కన్నం శ్రావణ్‌ కుమార్‌, మందమర్రిలతో పాటు లాడ్జ్‌ ఓనర్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.15 వేల నగదు, కండోమ్‌ పాకెట్స్‌, లను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి ఆరుగురు విటులు, లాడ్జి ఓనర్‌, మేనేజర్‌లను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు తెలిపారు .
తీరు మార్చుకొని వ్యాపారి
మంచిర్యాల జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో గల ఓ లాడ్జీలో విచ్చలవిడిగా వ్యభిచారం నడుస్తోంది. ‘జంటగా రండి… రూ.1,100 చెల్లించండి… రెండు గంటలు ఎంజారు చేయండి’ అంటూ లాడ్జీ ఓనర్‌ ఆఫర్‌ ప్రకటించడంతో డే అండ్‌ నైట్‌ ఆ లాడ్జీ కిటకిటలాడుతోంది. కొంతమంది యువకులతో పాటు అంకుల్స్‌ సైతం అమ్మాయిలతో వచ్చి గుడుపుతున్నారు. ఇట్టి సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జీపై దాడి చేసి ఆరు జంటలను పట్టుకున్నారు. ఆరుగురు విటులతో పాటు లాడ్జీ మేనేజర్ను అరెస్టు చేసి, ఓనర్పై కేసు పెట్టారు. అమ్మాయిలను సఖి సెంటర్కు పంపారు. పట్టణానికి చెందిన సిరిపురం శ్రీనివాస్‌ బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో సాయినాథ్‌ రెసిడెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో గత వారం పోలీసులు లాడ్జీపై దాడి చేయగా ఆరు జంటలు పట్టుబడ్డాయని తెలిపారు. విటులు సుంకరి శివయ్య (ఆకెనపల్లి, బెల్లంపల్లి), మందాల శివ ఆశిష్‌ (గోదావరిఖని), గోస్కుల ప్రశాంత్‌ (వెల్గటూర్‌), ఆకుల ప్రశాంత్‌ (గోదావరిఖని), రౌతు కార్తీక్‌ (గోదావరిఖని), తిరుపతి (లక్సెట్టిపేట)లను అరెస్టు చేశామన్నారు. రూముల్లో మహిళలతో రెండు గంటలు గడపడానికి లాడ్జీ మేనేజ్మెంట్‌ రూ.1,100 వసూలు చేస్తోందన్నారు. డబ్బులు తీసుకొని వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. మేనేజర్‌ మోటం జనార్దన్ను సైతం అరెస్టు చేశామని తెలిపారు. లాడ్జీ ఓనర్‌ సిరిపురం శ్రీనివాస్ను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. శ్రీనివాస్కు పట్టణంలో ప్రముఖుడిగా పేరుంది. గతంలో మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. ఆయన రెండు నెలల కిందట ఇదే లాడ్జీలో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అయినా తీరు మార్చుకోకుండా అదే దందా కొనసాగిస్తున్నాడు. లాడ్జీకి వచ్చే కొంతమంది మహిళలకు పైసలు ఆశచూపి వివిధ ప్రాంతాలకు కూడా పంపుతున్నట్టు విచారణలో తేలింది.

Spread the love