మున్సిపల్ కార్యాలయంలో డీజిల్ అవినీతిపై విచారణ..

– సానిటరీ ఇన్స్పెక్టర్ పై విచారణ చేసిన ఆర్ డి ఎమ్ ఏ..
– సిడిఎంఎ కు నివేదించనున్నట్లు తెలిపిన ఆర్ డి ఎమ్ ఏ షాహిద్ మసూద్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో 2022 సంవత్సరంలో 8 లక్షల రూపాయల  డీజిల్  వాడకంలో అవినీతి జరిగిందని  మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులను ఆర్ డి ఎమ్ ఏ షాహిద్ మసూద్ తనిఖీలు చేశారు.గతంలో మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన బి. నగేష్ ను జిల్లా కలెక్టర్ వివరణ కోరగా ఆయన స్పందించకపోవడంతో  జిల్లా కలెక్టర్  నగేష్ ను సస్పెండ్ చేశారు. డిజిల్ వాడకంలో జరిగిన అవినీతిపై విచారణను త్రీమెన్ కమిటీకి నియమించారు. డిజిల్ వాడకంలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్ పూర్తి నివేదికను తెప్పించుకున్నారు.  మున్సిపల్ కార్యాలయంలో ఆర్డిఎంఏ షాహిద్ మసూద్  నగేష్ కు సంబంధించిన జాయినింగ్ అయిన నాటి నుండి  విధులు నిర్వహించిన కాలానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి దానిపై పూర్తి నివేదికను హైదరాబాద్  సిడిఎంఏ అధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట మునిసిపల్ కమిషనర్ గోనె అన్వేష్, ఆర్డిఎంఏ కార్యాలయ సూపరిండెంట్    గుర్రం శ్రీనివాస్ ఉన్నారు.
Spread the love