- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని నిగ్వ గ్రామంలో రూ. 4,53,620/ గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం డీపీఓ ఆదేశాల మేరకు వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ సమక్షంలో నిధుల దుర్వినియోగంపై పంచాయతీ అధికారితో విచారణ చేపట్టారు. అదేవిధంగా గ్రామపంచాయతీ లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విచారణ నివేదికలను జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తామని డీఎల్పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భీమేష్, పంచాయతీ కార్యదర్శి హరీష్, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



