చెరువులో పూడికతీత పనుల పరిశీలన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని పల్లె చెరువులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా కొనసాగుతున్న పూడికతీత పనులను ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ సోమవారం సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసిన చేశారు. కూలీలతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన కొలతల మేరకు పూడిక తీయాలన్నారు. కూలీలకు గిట్టుబాటు అయ్యేలా పని కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పని ప్రదేశంలో కూలీలు సేద తీరేందుకు, తాగేందుకు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు రక్షణ కోసం ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.
Spread the love