Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్టాపన

స్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్టాపన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని బషీరాబాద్ గ్రామ స్మశాన వాటికలో గురువారం స్థానిక గ్రామ పంచాయతీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆప్త మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శివుడి విగ్రహాన్ని విరాళంగా అందించారు. వారి సహకారంతో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి శివుడి విగ్రహాన్ని స్మశాన వాటికలో ప్రతిష్టించారు. శివుడి విగ్రహం అందించిన ఆప్త మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బైకాన్ జమున మహేష్, ఉప సర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి  నవీన్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పృథ్విరాజ్, సదర్ రమేష్, వార్డ్ సభ్యులు రవి, సంఖ్యత సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పటేల్ సంఘం  అధ్యక్షుడు అశ్విన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పలు సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -