
పంచాయితీ పాలకవర్గం, కార్యాలయ సిబ్బంది సమిష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం ఎంపిడిఓ జి.శ్రీనివాసరావు అన్నారు.సర్పంచ్ అట్టం రమ్య అధ్యక్షతన బుధవారం పాలకవర్గం సభ్యుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయితీ 14 వ పాలకవర్గం గడువు ముగియడంతో బుధవారం పాలకవర్గం చివరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఓ హరిక్రిష్ణ పంచాయతీ ఆధాయ, వ్యయాలు, ఇప్పటివరకు నిర్వహించిన అభివృద్ధిని పనులను చదివివినిపించారు. అనంతరం పాలకవరం సభ్యులను శాలువ, పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సీతారామరాజు, ఉపసర్పంచ్ రేమళ్ళ కేధర్నాధ్, యు ఎస్ ప్రకాశ్ రావు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ తో పాటు పాలక వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.