సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

– టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షులు సుతారి పాపారావు
నవతెలంగాణ- తాడ్వాయి
విద్యా శాఖలో 16సంవత్సరాల నుంచి ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సుతారి పాపారావు డిమాండ్ చేశారు. బుధవారం సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షులు సుతారి పాపారావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా విద్యా శాఖలో పనిచేస్తూ సమాచారాన్ని అందించడంతో పాటు ప్రభుత్వానికి, విద్యావ్యవస్థకు వారధిగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రవర్తికరించాలని డిమాండ్ చేశారు. మిగతా శాఖల ఉద్యోగులను ఏ విధంగా క్రమ వర్ధికరిస్తున్నారు వీరిని కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించి, ప్రభుత్వ ఉద్యోగులు కల్పించే సకల సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వంక నాగేశ్వరరావు,మంకిడి స్వామి, రవికుమార్, కోకిల సారయ్య, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love