ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 163 వ జాతీయ రహదారి వెంట గురువారం పంచాయతీ కార్యదర్శి శంకర్ గతంలో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి శంకర్ నవతెలంగాణతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని కాస్త ముందుగా నిర్వహించాల్సి ఉండగా వర్షము నీరు లేకపోవడం వల్ల ఆలస్యం అయిందని అన్నారు. ప్రస్తుత తరుణంలో వర్షాలు కురుస్తున్నందున మొక్కలు తొందరగా ఏనుకునే అవకాశం ఉన్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ నర్సరీలో పెంచిన మొక్కలు మొత్తం పూర్తిస్థాయిలో నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అదే విధంగా ప్రజలకు కూడా తమ ఇళ్లలో నాటుకునేందుకు మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Spread the love