Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్

బండి భగీరథ్‌కు తాత్కాలిక బెయిల్

- Advertisement -


చర్లపల్లి జైలు నుంచి విడుదల
జూన్ 26 వరకు కోర్టు అనుమతి
నవతెలంగాణ – మేడ్చల్ కలెక్టరేట్

పోక్సో కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 26వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టు సమాచారం. భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ముందస్తు లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, వెకేషన్ బెంచ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు తర్వాత సుమారు నెలరోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి ఆయన విడుదలైనట్టు తెలిసింది. అయితే, ఈ బెయిల్ పూర్తిగా పరీక్షలకు హాజరయ్యే ఉద్దేశంతో మాత్రమే మంజూరైనదని, కేసు విచారణ యథావిధిగా కొనసాగుతుందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ 26 తర్వాత తదుపరి న్యాయ ప్రక్రియల మేరకు ఆయన కోర్టు ఎదుట హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -