గురుకులంలో ఇంటర్మీడియట్ స్పాట్ అడ్మిషన్స్

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లను శనివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి, ఎంపీసీ లో ఖాళీలకు స్పాట్ అడ్మిషన్ల కొరకు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో శనివారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని, పదవ తరగతి జిపిఏ యూనిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Spread the love