సమాజంలో ఆదర్శంగా నిలిచిన అంక భారతి

– పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరి పోరాటం
నవతెలంగాణ – రెంజల్
పెళ్లి చేసుకొని ఆనందంగా భర్త పిల్లలతో సుఖసంతోషాలతో గడపాల్సిన తరుణంలో భర్త అనారోగ్యంతో మృతి చెందగా, అంక భారతి అనే మహిళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి తన జీవితాన్ని పణగా పెట్టింది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని సమాజంలో సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన అంక భారతి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు జన్మించగానే తన భర్త 2007లో అనారోగ్యంతో మృతి చెందగా ఆమె ఒంటరి పోరాటం ప్రారంభమైంది. అప్పటినుంచి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పనిచేస్తూనే, బ్రిడ్జి కోర్స్ లో నెలకు ₹1000 గౌరవ వేతనంతో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చది. తన పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్న తలంపుతో 2011 ఏప్రిల్ లో రెంజల్ మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల మంజూరు కావడంతో ఆ పాఠశాలలో అటెండర్ గా చేరింది. అప్పట్లో ఆమెకు నెలకు 2500 రూపాయల వేతనం ఇవ్వగా అట్టి డబ్బులతో పిల్లలను చదివించింది. బాబు ఫణీంద్ర డిప్లమా చేయగా, కూతురు ఇంటర్ పూర్తి చేసింది. ఇంటర్ పూర్తి కాగానే కూతురు సంతోషిని జిఎన్ఎమ్ కిమ్స్ లో స్టాఫ్ నర్స్ గా చేరగా, ఆమెను చదివించడానికి స్తోమత లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సంవత్సరానికి 30 వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి ముందుకు రాగా స్టాఫ్ నర్స్ కోర్సును పూర్తి చేసి చేయించింది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు ఉద్యోగాలను సంపాదించుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆమె పేర్కొంది. తన ఇద్దరు పిల్లలు ఉద్యోగంలో చేరడంతో ఆమె సంతోషాన్ని స్నేహితురాళ్లతో పంచుకోంది. ప్రస్తుతం ఆమెకు కసిరవ బాలికల పాఠశాలలో 9750 జీతంతో కాలాన్ని వెల్లదిస్తుండగా, గత రెండు సంవత్సరాల కిందట సిక్ అయ్యారు. 1,20,000 తో ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు రావా వారు సంతోషంగా ఉన్నారని, తన జీతంతో హాయిగా కాలాన్ని గడుపుతున్నట్లు ఆమె పేర్కొంది. సమాజంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ప్రస్తుతం మహిళ లోకానికి ఆమె ఆదర్శంగా నిలిచింది.
Spread the love